కంటి వెలుగు గొప్ప కార్యక్రమం: మంత్రి తలసాని

రథ సారథి, హైదరాబాద్:

కంటి చూపు సంబంధ సమస్యల పరిష్కారం కోసం కంటి వెలుగు కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ము షీరాబాద్ లో కేసీఆర్ చిత్ర పటానికి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని బాగ్ అంబర్ పేట డివిజన్ రామకృష్ణ నగర్ పార్క్ లో, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్ పూర్ డివిజన్ తాళ్లబాస్టి కమిటీ హాల్ లో కంటి వెలుగు శిబిరాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు.

కంటి వెలుగు కార్యక్రమం ఒక గొప్ప వరం అనీ, ప్రజలకు   ఉ చితంగా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్ళద్దాల పంపిణీ చేస్తున్నాం అన్నారు.కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రభుత్వం 250 కోట్ల రూపాయల ను ఖర్చు చేస్తుంది అనీ,దేశంలో ఎవరు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమం చేపట్టారు అనీ ఆయన కొనియాడారు.ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని , అందరూ ఈ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.