యాదవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
రథ సారథి. మిర్యాలగూడ:
ఈరోజు మిర్యాలగూడ డివిజన్ యాదవ సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ వేములపల్లి మండల కేంద్రంలోజరిగింది. ఈ సందర్భంగా వేములపల్లి సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజవర్గంలో యాదవుల జనాభా అధికంగా ఉంది, ఐకమత్యంగా ఉండాలని కోరారు, మిర్యాలగూడ నియోజవర్గంలో నామినేటర్ పోస్టులు దయచేసి యాదవుల కేటాయించాలని కోరారు,ఈ కార్యక్రమంలో, డివిజన్ యాదవ సంఘం అధ్యక్షుడు చిమట ఎర్రయ్య యాదవ్, కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, గౌరవాధ్యక్షుడు చింతలచెరువు లింగయ్య యాదవ్ , కే పి రాజు,,జ్వాలా, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ జడ రాములు యాదవ్, డి . కృష్ణ యాదవ్,జడ సృజన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.