పశు మిత్రులకు కనీస వేతనాలు ఇవ్వాలి
రథ సారథి,మిర్యాలగూడ:
తెలంగాణ ప్రభుత్వ పశు వైద్య శాఖలో గ్రామీణ ప్రాంతాలలో పశువులకు గొర్రెలకు మేకలకు గేదెలకు అనేక రకాల వైద్య సేవలు అందిస్తున్న పశు మిత్రలందరికీ కనీస వేతనం నిర్ణయించాలని లేదా ఆశా వర్కర్స్ మాదిరిగా పారితోషకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశు మిత్రల పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మరియు పశువర్ధక శాఖ జెడి కి వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల గేదెల గొర్రెల మేకల కోళ్లకు కుక్కల తదితర జంతువులకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సిన్, టీకాలు వేయడం శాస్త్ర చికిత్సలు గాలి కుంట వ్యాధి, నీలి నలిక వ్యాధి, పోచమ్మ వ్యాధి దొబ్బి వ్యాధి తదితర జబ్బులకు మందులు వేస్తూ రైతులకు చేదోడు వాదోడిగా ఉంటున్న పసుమిత్రలకు ఎలాంటి వేతనం లేకపోవడం అన్యాయం అని అన్నారు. పశు వైద్యశాల అందుబాటులో లేని ప్రాంతాలలో ఎనిమిది సంవత్సరాల క్రితం ట్రైనింగ్ ఇచ్చి వీరిని నియమించారు . పసుమిత్రలలో మెజారిటీగా అణగారిన వర్గాల మహిళలేనని వీరికి వేతనాలు లేకుండా ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందని విమర్శించారు. వీరందరూ పశువులకు అనారోగ్య సమస్యలు గురైనప్పుడు రాత్రనకా పగలనకా కష్టపడుతున్నారని అన్నారు.ప్రభుత్వం వీరికి కనీస వేతనం నిర్ణయించాలని అప్పటివరకు ఆశా వర్కర్స్ మాదిరిగా పారితోషకాలు ఇవ్వాలని,గుర్తింపు కార్డు, యూనిఫాం, ప్రమాద బీమా, పిఎఫ్ ఈఎస్ఐ,టిఏ డిఏ లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతావని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పసుమిత్రల యూనియన్ అధ్యక్షులు పి మనిషా, ప్రధాన కార్యదర్శిగా అండెం సునీత, జిల్లా నాయకులు ఎస్.కె హస్మ,జె రాధిక,సిహెచ్ దుర్గ భవాని ,ఎస్ మాధవి,డి మాధవి,ఎం మంజుల, బి జానకమ్మ,ఎం సుజాత ఎన్ సంధ్య,వై సరిత,ఎన్ సంధ్య,ఎం కవిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.