బీఎల్ఆర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
రథ సారథి, మిర్యాలగూడ:
మొల్కపట్నం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ కి చెందిన మాజీ సర్పంచ్ మరియు ప్రస్తుత 9వ వార్డు మెంబర్ జేరిపోతుల ఎల్లమ్మ మంగళవారం సామాజికవేత్త, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది . ఈ సందర్భంగా జేరిపోతుల ఎల్లమ్మ మాట్లాడుతూ పేదల కోసం పోరాడవలసిన సిపిఎం పార్టీ పెత్తందారి పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ తో కలిసి పోవడాన్ని జీర్ణించుకోలేక,పేదలకి న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొల్కపట్నం బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వార్డు మెంబర్ పేరెల్లి నాగేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి, ఉప సర్పంచ్ రామదార కరుణాకర్, వార్డ్ మెంబర్ రాచూరి వెంకన్న, సీనియర్ నాయకులు భారీ పాండు, కొమ్మనబోయిన ఆంజనేయులు, మోసాల శ్రీకాంత్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.