కర పత్రాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
రథసారథి,మిర్యాలగూడ: ఈనెల 28 నుంచి వచ్చేనెల 3 వరకు అడవిదేవులపల్లి మండల కేంద్రం లోని శ్రీ స్వయంభూ మహిషాసుర మర్దిని అమ్మ వారి పున:ప్రతిష్ఠ, ఆలయ పున:నిర్మాణ మహాకుంభాభిషేక మహోత్సవ కరపత్రికతో పాటు ఫిబ్రవరి 1న మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంపు మైదానంలో నిర్వహించనున్న శ్రీ భీష్మకాదశి ప్రయుక్త శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర విరాట్ పారాయణం కరపత్రికను స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌తో కలిసి శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, సర్పంచ్ మర్రెడ్డి, గుండా సీతారామయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, కందగట్ల అశోక్, పశ్య శ్రీనివాస్ రెడ్డి, గొంగిడి సైదిరెడ్డి, అల్లాని రమేశ్, రేపాల రమేశ్, బండి వెంకటేశ్వర్లు, బాష్య నాయక్, తిరంశెట్టి కోటేశ్వర్ రావు, ఆలయ నిర్వహణ కమిటి సభ్యులు, భిష్మకాదశి ఉత్సవ నిర్వహణ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.