ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలపై స్పెషల్ డ్రైవ్: మంత్రి తలసాని
రథ సారథి హైదరాబాద్ :
నగరం లో అగ్ని ప్రమాదాల పై మంత్రి కె. టి. రామారావు నేతృత్వం లో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగిందనీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ లతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం లో చర్చించాం అనీ,
ఈ మధ్య జరిగిన అగ్ని ప్రమాదాల పై లోతుగా చర్చించాం అనీ మంత్రి తెలిపారు.అక్రమ కట్టడాలు ,ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను గుర్తించేందుకు ఓ ప్రత్యేక కమిటీ ని నియమించామని,
ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను కూడా పరీశీలిస్తుందన్నారు.
త్వరలోనే ఆయా భవనాల గుర్తింపు పై స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తాం అన్నారు.
అగ్ని మాపక యంత్రాలు వెళ్లలేని స్థితిలో ఉన్నపుడు వాడుకోవాల్సిన సాంకేతికత పై కూడా చర్చించా మని,
అగ్ని ప్రమాదం జరిగిన నల్ల గుట్ట భవనాన్ని కూల్చేందుకు టెండర్ పిలిచాం అనీ,41 లక్షల రూపాయలకు టెండర్ ఖరారైందన్నారు.
రేపటి నుంచి కూల్చి వేత ప్రారంభిస్తాం అన్నారు.
చిన్న పరిణామం లో ఉండే అగ్ని మాపక యంత్రాలను భవిష్యత్ లో వినియోగించేందుకు ఆలోచిస్తున్నాం అనీ,
భవనాల్లో సామర్ధ్యానికి మించి వస్తువుల నిల్వ వల్ల అగ్ని ప్రమాదాల ఉధృతి పెరుగుతోంది అనీ మంత్రి తలసాని తెలిపారు.
భవిష్యత్ లో అగ్ని ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం అన్నారు.
ఉన్న ఫళంగా అక్రమ కట్టడాలను తొలగించలేం అనీ, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం అన్నారు .
నల్ల గుట్ట అగ్ని ప్రమాదం లో మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తున్నాం అన్నారు.
రిపబ్లిక్ వేడుకలు నిబంధనల మేరకు జరుగుతాయి అనీ మంత్రి తెలిపారు.
ఇందులో రాజకీయం ఏమి లేదనీ,
కేసీఆర్ పుట్టిన రోజు నాడు సచివాలయం ప్రారంభిస్తే తప్పేమిటీ? అనీ తలసాని ప్రశ్నించారు.
మోడీ పుట్టిన రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కడితే దాన్ని ప్రారంభించుకోవచ్చు అనీ,బండి సంజయ్ మోడీ కి ఆ సలహా ఇచ్చుకోవచ్చు అనీ హితవు పలికారు.
ప్రతి దాన్ని వివాదం చేయడం బీజేపీ కి అలవాటు గా మారింది అనీ మంత్రి తలసాని విమర్శించారు.