డిప్యూటీ డిఈవో, ఎంఈవో పోస్టులు భర్తీ చెయ్యాలి: దశరథ్ నాయక్
రథ సారథి మిర్యాలగూడ;
విద్యా శాఖలో క్షేత్రస్థాయి పోస్టులైన ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్లకు బదిలీలు, పదోన్నతులు ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టెందుకు చర్యలు తీసుకోవడం శుభపరిణామం అయినప్పటికీ ప్రధానోపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందిని బంజారా ఉద్యోగులు సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరత్ నాయక్ అన్నారు. బుధవారం స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ 2003, 2005, 2009లలో పదోన్నతి పొంది ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ కూడా జిహెచ్ఎంలు పొందలేదని అన్నారు.2007లో ఉపవిద్యాధికారిగా కొత్తగా నియామకమైన వారు ప్రస్తుతం మూడు పదోన్నతులు పొంది జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ హోదాలో పాఠశాల విద్యా శాఖలో పనిచేస్తున్నారని,కారుణ్య నియామకాలలో జూనియర్ అసిస్టెంట్ గా నియామకం అయినా వారు జిల్లా విద్యాధికారులుగా పదోన్నతి పొందరిని అన్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు గత 18 సంవత్సరాల నుండి ఒక్క పదోన్నతి లేకపోవడం చాలా బాధాకరమన్నారు.
తక్షణమే ఎం ఈ వో, డిప్యూటీ డిఈవో పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,కోర్టు కేసుల కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ రెండు దశాబ్దాలుగా విద్యావ్యవస్థ నాశనం చేశారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం
మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పేరుకు బదులు బ్లాక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(బి ఈ వో) గా,ఉపవిద్యాధికారి పోస్ట్ కు బదులు నియోజకవర్గ విద్యాధికారి(సీ ఈ వో)గా పేర్లు మార్చుకొని పాతవి రద్దు కొత్త రాష్టం కొత్త విద్యావ్యవస్థగా సృష్టించి పక్కన వున్న ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా మండలానికి రెండు ఎంఈఓ పోస్టులను సృష్టించి పదోన్నతులు ఇవ్వాలని కోరారు.
ఇకనైనా మన రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం దీనిపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అదేవిదంగా డైట్, బి ఈ డి కళాశాల అధ్యాపక పోస్టులు పదోన్నతి ద్వారా భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, పానుగోతు ఛత్రు నాయక్,రామావత్ రవినాయక్,గుగులోత్ గోపినాయక్, పానుగోత్ సైదా నాయక్,ధర్మా నాయక్, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.