ఉగాది లోపు జిల్లాగా ప్రకటించాలి
రథ సారథి మిర్యాలగూడ:
తెలుగు నూతన సంవత్సరం ఉగాది నాటికి మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని మిర్యాల మాజీ శాసనసభ్యులు రేపాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అమరవీరల స్తూపం వద్ద పలువురు మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమకారులతో ఆయన మాట్లా డారు. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అర్హతలు అవకాశాలు మిర్యాలగూడకు ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు ఆకాంక్ష ప్రజలందరిలో బలంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జిల్లా ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు.మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి లు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఉగాదిలోపు జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించకపోతే కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పాల్గొనాలని సూచించారు. అనంతరం కరాటే విద్యార్థులకు ఆయన జిల్లా ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి వారి తల్లిదండ్రులకు జిల్లా ఏర్పాటు ఆవశ్యకత వివరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు చేగొండి మురళి యాదవ్, దాసరాజు జయరాజు, కరాటే మాస్టర్ రమేష్ ,మనోజ్, వేణుగోపాల్ రెడ్డి ,సోమయ్య రామయ్య తదితరులు పాల్గొన్నారు.