కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
రథ సారథి,మిర్యాలగూడ:
రాహుల్ గాంధీ చేపట్టినహత్ సే హత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పైన పాదయాత్ర చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా కాబోయే దేశ ప్రధాని రాహుల్ గాంధీ అనీ,నేడు టిఆర్ఎస్ ,బిజెపి లు, అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసిస్తూ, దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి ఆశయంగా,పని చేయాలని, పార్టీ శ్రేణులు అందరు కూడా పార్టీని గెలిపించడానికి ముందుండి పనిచేయాలని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిరుమర్తి కృష్ణయ్య, బత్తుల లక్ష్మారెడ్డి , పగిడి రామలింగయ్య , ముదిరెడ్డి నర్సిరెడ్డి, పోదిల శ్రీనివాస్, ఐ ఎన్ టి యు సి పట్టణాధ్యక్షులు చాంద్ బాషా, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఏ సలీం , ఓబిసి రాష్ట్ర కోఆర్డినేటర్ మెరుగు శ్రీనివాస్, తమ్ముడ బోయిన అర్జున్, కందుల నరసింహారెడ్డి, పొదిలి వెంకన్న, ఇమ్రాన్, తలకొప్పుల సైదులు, కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ వర్థంతి సంధర్భంగా పట్టణంలోనీ మహాత్మా గాంధీ విగ్రహానికి శంకర్ నాయక్ ,ఇతర కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.