కాపుగంటి వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో ఆర్థిక సాయం
రథసారధి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సెల్ ఫోన్ దుకాణం యజమాని ఆళ్ళ రామకృష్ణ కుటుంబానికి సెల్ ఫోన్ అసోసియేషన్ వారు ఆర్థిక సహాయం చేశారు. సెల్ ఫోన్ అసోసియేషన్ అధ్యక్షుడు కాపుగంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రూ. 51,000 ఆ కుటుంబానికి ఈరోజు అందజేశారు. ఈ కార్యక్రమంలో పున్నా నరేందర్, నరేష్ , గుండా బాలు తదితరులు పాల్గొన్నారు.