ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ
రథ సారథి,మిర్యాలగూడ:
74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో జాతీయ పతావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన్న విజయసింహారెడ్డి ,మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరు నగరు భార్గవ్ , రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్రవిష్ణు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.