బలహీన వర్గాల వ్యతిరేక బడ్జెట్ : జాజుల
రథసారథి ,మిర్యాలగూడ:
పార్లమెంట్ లో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. రూ.45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 1,500 కోట్లు మాత్రమే కేటాయించి 70 కోట్ల మంది బీసీలను అవమానించారని అన్నారు. బీసీల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికొదిలేసింది అనీ,ఇది పూర్తిగా బలహీన వర్గాల వ్యతిరేక బడ్జెట్ అనీ ఆయన విమర్శించారు.