కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత
రథసారథి హైదరాబాద్:
శంకరాభరణం ,సాగర సంగమం, స్వాతిముత్యం వంటి పలు హిట్ సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ డైరెక్టర్ కె.విశ్వనాథ్ (92) గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు చలన చరిత్రలో శంకరాభరణం వంటి హిట్ సినిమా అందించిన కాశీ విశ్వనాథ్ ఆ సినిమాతో తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పారు. ఈ సినిమాలో శంకర శాస్త్రి పాత్రను అద్వితీయంగా పోషించిన సోమయాజులు ఎంతో పేరు గడించారు. సుమారు 50 పైగా చిత్రాలను తీసిన విశ్వనాధ్ గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు .శుక్రవారం విశ్వనాద్ అంత్యక్రియలు జరగనున్నాయి .ఈయన మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటుగా డైరెక్టర్లు, హీరోలు ,సినీ ప్రముఖులు విశ్వనాథ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.