బడ్జెట్ లో బీసీ లకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి: జాజుల

రథ సారథి, మిర్యాలగూడ:

6వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో బీసీలకు రూ.5,698 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారని ఈ కేటాయింపులతో బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు.50 శాతం ఉన్న బీసీలకు తక్కువ కేటాయింపు లు చేయడం సరికాదన్నారు. ఈ బడ్జెట్లో బీసీ బంధు ప్రవేశ పెట్టి వారికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు జరపాలని అన్నారు.దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. గత నాలుగు సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్ కు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ యువత జిల్లా కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి అలిసిపోయారని అన్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,జయమ్మ,గుండెబోయన నాగేశ్వరరావు యాదవ్,ఎర్రబెల్లి దుర్గయ్య,కవిత,దాసరాజ్ జయరాజ్,చేగొండి మురళి యాదవ్,సావిత్రి,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.