నాటక పోటీలకు రమణాచారికి ఆహ్వానం
రథసారథి,మిర్యాలగూడ
మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు తడకమళ్ళ రాంచందర్ రావు హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వి. రమణాచారి, ఐ.ఏ.యస్ నీ ఆయన క్యాంప్ కార్యాలయం లో కలిసారు. మిర్యాలగూడ లో 2023 మార్చినెల 10 నుండి 20 వరకు 11రోజులు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పద్య నాటకాలు, సాంఘిక నాటికల పోటీల గురించి వివరించి ఆయనను పోటీలకు ఆహ్వానించారు. ఆయనను సహాయ,సహకారాలర్థించుటయేగాక రాష్ట్ర పరివ్యాప్తంగా ఇలాంటి నాటకోత్సవాలు నిర్వహించాలని, ప్రభుత్వం తరపున నంది అవార్డుల లాగా “థియేటర్ అవార్డ్స్” నిర్వహించాలని, నాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని చర్చించారు. అలాగే నాటకరంగ కళాకారులకు పెన్షన్లు సక్రమంగా నెలనెలా వచ్చేలాచేయాలని, కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయించాలని విజ్ఞప్తి చేసి ఆయన కు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వినతి పత్రాన్ని అందించారు. రామచంద్ర రావు విన్నపాలను రమణాచారి గారు విన్నపాలన్నీ శ్రద్ధగా విని సానుకూలంగా స్పందిస్తూ నాటకరంగ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని,మిర్యాలగూడ పరిషత్ కు తప్పక వస్తానని,సహకరిస్తానని హామీ యిచ్చారు.