రేపు సర్ధార్ చకిలం శత జయంతి వేడుకలు
రథ సారథి, నల్గొండ:
నల్గొండ జిల్లా ముద్దు బిడ్డ చకిలం శ్రీనివాస రావు శత జయంతి వేడుకలను సోమవారం నల్గొండ లోని రామగిరి లో ఘనంగా నిర్వించనున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపి గా గెలుపొందిన చకిలం నల్గొండ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.కమ్యూనిస్టుల కంచుకోటలను బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. పేద, బడుగు బలహీనర్గాల నాయకునిగా పేరుగాంచిన చకిలం శ్రీనివాసరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గా చాలా కాలం పనిచేశారు.అలనాటి ప్రధానులు ఇందిరా, రాజీవ్ , పీవీ నరసింహారావు లకు చకిలం శ్రీనివాసరావు అత్యంత ఆప్తునిగా వుండే వారు అనీ పేరు ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా చకిలం శ్రీనివాసరావు ఇంటి తలుపు తట్టేవారు. తనను నమ్మి వచ్చిన ప్రజలకు కాదనకుండా చకిలం శ్రీనివాసరావు ఎన్నెన్నో సేవలను అందించారు. ఇటు ప్రజా ప్రతినిధిగా, అటు కాదనకుండా సహాయం చేసే వ్యక్తిగా చకిలం శ్రీనివాసరావు నల్గొండ జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన శతజయంతి వేడుకలను నల్గొండ లోని రామగిరి క్రాస్ రోడ్ లో ఆయన కుమారులు చకిలం అనిల్ కుమార్, చకిలం సునీల్ కుమార్, కుటుంబ సభ్యులు, చకిలం అభిమానుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు.