క్యాన్సర్ పట్ల అవగాహన అవసరం: డాక్టర్ జీవనజ్యోతి

రథసారథి,మిర్యాలగూడ:

 

ప్రపంచవ్యాప్తంగా మహిళలు  ప్రధానంగా రొమ్ము గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లతో బాధపడుతున్నారని, వీటిపై అవగాహన పెంచుకోవాలని  నల్లగొండ స్త్రీ వ్యాధి వైద్య నిపుణులసంఘంఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో  ఐఎంఏ మిర్యాలగూడ అధ్యక్షురాలు డాక్టర్ జీవన జ్యోతి తెలిపారు.

సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి హాస్పిటల్ లో ఇండియన్ సొసైటీ ఆఫ్ కాల్పోస్కోపి అండ్ క్లినికల్ పథాలజీ అనుబంధ నల్లగొండ గైనకాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కాల్పోస్కోపి వర్క్ షాప్ లో ఆమె పాల్గొని మాట్లాడారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ ద్వారా వచ్చే జబ్బులు వాటి నివారణపై వర్క్ షాప్ లో అవగాహన కల్పించారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లను వ్యాక్సిన్ ద్వారా నివారించవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్ష ఇరవై రెండు వేల మంది మహిళలు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని అందులో 62 వేల మంది తనువు చాలిస్తున్నారని చెప్పారు. 2030 నాటికి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లను నివారించాలన్న ఆశయంతో ఇండియన్ సొసైటీ ఆఫ్ కాల్పోస్కోపీ అండ్ క్లినికల్ పథాలజీ పనిచేస్తుందన్నారు. తొలి దశలో క్యాన్సర్ ను గుర్తించినట్లయితే వ్యాధి బారిన పడిన మహిళలు చికిత్స ద్వార సాధారణ జీవితం గడపవచ్చన్నారు. వర్క్ షాప్ లో నల్లగొండ స్త్రీ వ్యాధి వైద్య నిపుణుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఆర్ మంజుల కార్యదర్శి, డాక్టర్ రాజేశ్వరి ప్రవీణ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ కాల్పోస్కోపీ అండ్ క్లినికల్ పెథాలజీ (isccp )అధ్యక్షురాలు డాక్టర్ లీల, కామినేని మెడికల్ కాలేజ్ హెచ్ ఓ డి డాక్టర్ ప్రసన్న లత, జ్యోతి హాస్పిటల్ డాక్టర్ అమూల్య తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.