పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహా తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లు, అసోసియేషన్ వారు 250 మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగబోయే పర్యావరణ మార్పులకు, కాలుష్య నియంత్రణ కు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 20 వేల మొక్కలను నాటుతామని ముందుకు వచ్చారు . అందులో భాగంగా ప్రతీ రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటడం జరుగుతుంది అని, అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కుల, మత , వర్గ, పార్టీ విబేధాలు లేకుండా ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి మొక్కలు నాటి భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిధిద్ధాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.