ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి : ఎమ్మెల్యే బత్తుల
రథసారథి ,మిర్యాలగూడ:
మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మిర్యాలగూడ పట్టణ మున్సిపల్ ఆధికారులతో మరియు ప్లాస్టిక్ కవర్స్ యజమానులతో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్స్ యజమానులతో మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ప్రతి వ్యాపారస్తులకు మీ ద్వారా ప్లాస్టిక్ కవర్స్ ను తీసుకోవడం జరుగుతుంది అని కావున నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధ పట్టణంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్ లను నీషేధించే దిశగా ప్రజలతోపాటు ప్లాస్టిక్ కవర్స్ యజమాన్యులైన మీరు కూడా సహకరించాలని మీ ద్వారా ప్రజలు కూడా తెలిసే విధంగా ప్రచారం నిర్వహించి, మిర్యాలగూడ అభివృద్ధిలో మీరు కూడా పాత్ర వహించాలని ఆయన కోరారు. పర్యావరణానికి ప్రమాదం కాకుండా ఉండేటువంటి క్లాత్ కవర్స్ ని వాడాలని ఆయన సూచించారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు ప్లాస్టిక్ కవర్ యజమానులు పాల్గొన్నారు.