ఉమా మహేశ్వర క్షేత్రం లో జలపాతం
రథ సారథి, అచ్చంపేట:
దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం ప్రభావం తో ప్రసిద్ధ
ఉమామహేశ్వర క్షేత్రం వద్ద ఎత్తయిన కొండల నుంచి జలపాతం వలె జాలువారుతున్న వర్షపునీరు జారుతూ కనువిందు చేస్తోంది.ఈ జలపాతాన్ని చూసి భక్తులు , పర్యాటకులు మంత్రముగ్ధులై సెల్ ఫోన్లలో అందమైన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తు న్నారు.ఈ క్షేత్రం పైనుండి కొండలనుంది వస్తున్న వాన నీరు కిందికి దూకుతూ అందర్నీ ఆకట్టు కుంటోంది.