సాంబశివరావు సార్ కు ఘనంగా సన్మానం
రథసారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్న గరినె సాంబశివరావు కు శనివారం ఎంఈఓ బాలాజీ నాయక్, పాఠశాల సిబ్బంది ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావును ఎంఈఓ బాలాజీ నాయక్ శాలువాతో సత్కరించారు. అనంతరం ఎంఈఓ బాలాజీ నాయక్ మాట్లాడుతూ 41 ఏళ్ల తన ఉపాధ్యాయ వృత్తిలో సాంబశివరావు ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతగా తన విధులను నిర్వర్తించారని పేర్కొన్నారు. ఆయన ఉపాధ్యాయ వృత్తి అందరికీ ఆదర్శనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ హెడ్మాస్టర్లు వెంకన్న, రవి, రాబియా, అమేనా నుజహత్,, అతియ, ఇష్రత్ ఫర్హీన్, షంసున్నిస ,ప్రవీణ, సయీద్ బాబా, అయూబ్ ఖాన్, సోమేశ్వరరావు, ఖాజా ,రామకృష్ణారావు , తదితరులు పాల్గొన్నారు.