నూతన ఎంఈవో బాలు నాయక్ కు పీఆర్టియు ఘన సన్మానం
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ ఎంఈవో గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మిర్యాలగూడ మండల విద్యాధికారి ఎల్. బాలునాయక్ ను పిఆర్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. మిర్యాలగూడ అర్బన్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు మునగాల రామిరెడ్డి, అనుముల సైదిరెడ్డి, రాష్ట్ర, జిల్లా మండల బాధ్యులు యాదగిరి రెడ్డి, దస్తగిరి ,ఎంవి రమణాచారి, హబీబా, జానయ్య, నాగలత, జయంతి, రఘు ,అరుణ ,నిర్మల, సరిత ,లక్ష్మీబాయి, లక్ష్మి, తదితరులు ఎంఈవో బాలు నాయక్ ను శాలువాలతో, పూలదండలతో ఘనంగా సత్కరించారు.