ఘనంగా మహాత్మగాంధీ జయంతి వేడుకలు..
రథసారథి, మిర్యాలగూడ :
జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలసి గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కాలినడకన వెళ్లి పట్టణంలోనీ మహాత్మా గాంధీ విగ్రహానికి డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, పలు స్వచ్చంధ సంస్థలు, కాంగ్రెస్ నాయకులు తో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేను నా మిర్యాలగూడలో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కంపోస్టబుల్ కవర్స్ ప్రారంభించారు . నాయకులు అందరితో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈరోజు నుంచి ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ కి కృషి చేస్తామని, కంపోస్టబుల్ కవర్స్ మాత్రమే వాడుతామని ప్రమాణం చేయించడం జరిగింది. స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమాన్ని ప్రారంభించి పట్టణంలోని రోడ్లను శుభ్రం చేసారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏరియా ఆసుపత్రిలో డాక్టర్స్ తో కలసి గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించి కంపోస్టబుల్ కవర్స్ ప్రారంభించారు.ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దాన శిబిరంలో పాల్గొని రక్త దాతలను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సత్యా గ్రహమే ఆయుధంగా , అహింసా మార్గంలో పోరాడి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మన జాతి పిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా వారి ఆశీర్వాదాలతో , వారి ఆదర్శంగా ఈరోజు మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ ప్రారంభించడం ,స్వచ్చ మిర్యాలగూడ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉందన్నారు..మీరు అందరూ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని , నా ఈ పదవీకాలం పూర్తయ్యే సరికి మిర్యాలగూడ నియోజకవర్గం పారిశుద్ధ్యంలో గానీ, పర్యావరణ పరిరక్షణలో గానీ, ప్రభుత్వ విద్యా, వైద్యంలో గానీ సంవృద్ధి చెందాలి అనీ,మార్పు తీసుకొని రావాలి అని నేను బలంగా సంకల్పించాను .అదే ఉద్ధేశంతో నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా గత కొంత కాలంగా మొక్కలు నాటడం గానీ, స్వచ్చ ధనం – పచ్చదనం కార్యక్రమం గానీ, ప్రభుత్వ విద్యా సంస్థలు, వైద్య శాలలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం గానీ, ఈరోజు ప్లాస్టిక్ కవర్స్ నియంత్రణ గానీ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంధని అన్నారు.ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలి అన్నారు.ఐకమత్యంతో కూడిన మంచి సమాజాన్ని నిర్మించేందుకు ఈరోజు నాతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు .