ప్రతీ రైతుకు పట్టాలు అందచేస్తాం.. ఎమ్మెల్యే బిఎల్ఆర్
రథసారథి,అడవిదేవులపల్లి:
అడవిదేవుల పల్లి మండలంలో ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రజా పాలనలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి మండలంలోని రైతు వేదిక నందు అధికారులతో కలసి ఇప్పటివరకు ప్రజా పాలనలో సేకరించిన దరఖాస్తుల పై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
అన్ని విభాగాల అధికారులకు వచ్చిన ఫిర్యాదులు ఇప్పటివరకు పరిష్కరించిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ప్రతీ రోజు మండలంలోని ఏదో ఒక గ్రామ పంచాయితీ కార్యాలయాలలో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తాము అన్నారు .అధికారులు లేకపోతే తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
గ్రామాల్లో రైతులకు నిత్యం అందుబాటులో ఉండాలి అని ఆయన సూచించారు . రైతుల సమస్యలు ఏది ఉన్నా తక్షణమే పరిష్కారం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజలు తమ సమస్యలకు, పంచాయతీ కార్యాలయంలోనో లేక మండల కార్యాలయంలో పరిష్కారం జరగాలి గానీ వారు క్యాంప్ కార్యాలయం వరకు, జిల్లా కేంద్రం వరకు వెళ్ళే విధంగా వారిని ఇబ్బంది పెట్టకూడదు అని హెచ్చరించారు.
అనంతరం డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , మరియు మండల పార్టీ ప్రసిడెంట్ బాలు నాయక్ తో కలిసి ప్రజలతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి ఫిర్యాదులు సేకరించారు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రజలు, రైతులు తమ సమస్యలు పరిష్కారం కోసం మిర్యాలగూడ పట్టణం వరకు దూర ప్రయాణాలు చేసి ఇబ్బంది పడుతున్నారు అని, అలా వారికి ఇబ్బంది కలగకుండా అధికారులను వారి దగ్గరకి తీసుకొని రావాలని అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే ప్రజా సమస్యలపై ప్రజా పాలన కార్యక్రమం అన్నారు.
అడవిదేవులపల్లి మండలాలలో అత్యధికంగా రైతులు భూమి పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి అందరికీ న్యాయం చేయాలని భూమాత పైలెట్ ప్రాజెక్టు ద్వారా సాగులో ఉన్న ప్రతీ రైతుకు పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అలాగే అడవీదేవులపల్లి మండలంలో రైతులను రాజుని చేసేందుకు నిర్వహిస్తున్న దున్నపోతుల గండి ప్రాజెక్టును కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం అనే విధంగా తమకి అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా ఉంటామని అన్నారు.