కులగణన ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. లింగంగౌడ్
రథసారథి, మిర్యాలగూడ:
సమగ్ర కులగణన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు. నవంబర్ 6నుంచి కులగణన సర్వే ప్రారంభమవుతున్న సందర్భంగా పట్టణంలోని ఎన్ఎస్పి గెస్ట్ హౌస్ లో కుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లింగంగౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి కులగణన సర్వే గనుక ఈ సర్వేను బీసీ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా శాస్త్రీయంగా,హేతుబద్ధంగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడాలన్నారు.సమగ్ర కులగణనపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని మీడియా ద్వారా ప్రతి పల్లెకు, ప్రతి గూడెంకు ప్రతి బస్తికి చేరుకునేలా విసృత ప్రచారం నిర్వహించడానికి కమిషన్ ప్రణాళిక రూపొందించాలని వారు కోరారు .
సమగ్ర కులగనకు తక్షణమే ప్రశ్నావళి ని రూపొందించి మార్గదర్శకాలు విడుదల చేయాలని అదేవిధంగా ఊరురా దండోరా వేయించి సుశిక్తులైన ఉద్యోగులను నియమించి చాలా సూక్ష్మంగా నిశితంగా కులాలను వారి సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను లెక్కించాలని ఆయన కోరారు.డిటిఎఫ్ నాయకులు కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ కులగణన అనేది బీసీల యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్, గుండు శ్రీరాములు గౌడ్ ,మున్నూరు కాపు సంఘం నాయకులు కంచి సత్యనారాయణ, జ్వాలా వేంకటేశ్వర్లు,పద్మశాలి సంఘం నాయకులు తిరందాసు వేణుగోపాల్,రజక సంఘం నాయకులు ఎర్రబెల్లి దుర్గయ్య,బొల్ల రామ నరసయ్య , మున్నూరు కాపు సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు పందిరి వేణు,యాదవ సంఘం డివిజన్ అధ్యక్షులు చిమట ఎర్రన్న,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మహేష్ గౌడ్ ,మండాది శంకర్,కొత్త వెంకట్,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు,నల్లగంతుల నాగభూషణం, వేమవరపు భీమరాజు ,నరేందర్ మండలి సావిత్రి ,ఊరిబండి శ్రీనివాస్ యాదవ్ ,కంపసాటి మధుసూదన్ యాదవ్ ,రేపల్లి సత్య ప్రకాష్ నాయుడు ,భూపతి నరేష్ గౌడ్, దోనేటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.