చంద్రబాబును కలిసిన వేమిరెడ్డి దంపతులు
రథసారధి ,అమరావతి:
కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం అమరావతిలోని సీఎం నివాసానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి పుష్పగుచ్ఛం అందించారు. టిటిడి బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించడంపై సీఎం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దేవదేవుడి సేవకు అవకాశం రావడం సంతోషంగా ఉందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా శ్రీవారి భక్తులకు సేవ చేస్తామని ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు స్పష్టం చేశారు.