బీసీ గర్జన సభ విజయవంతం..
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ లో బీసీ జెఏసి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ గర్జన విజయవంతం అయింది అని బీసీ జెఏసి కో కన్వీనర్ తమ్మడబోయిన అర్జున్ అన్నారు. కన్వీనర్ మారం శ్రీనివాస్, కోల సైదులు, రాపోలు పరమేశ్ లు, గుడిపాటి కోటయ్య, తిరుమలగిరి అశోక్ లతో కలిసి ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ ఎన్ఎస్పి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బీసీ గర్జన బహిరంగ సభ బీసీ కులాలు, విద్యార్థి సంఘాలు ,ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగస్తులు, అన్ని వర్గాల సామాజిక ప్రజలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున వచ్చి బహిరంగ సభను విజయవంతం చేసినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.హక్కుల సాధన కొరకు జరిగే పోరాటం అంతం కాదు ఆరంభం అని అన్నారు.బీసీ లకు రాజ్యాధికారం సాధించే వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈనెల 6 నుండి జరుగనున్న సమగ్ర కుల గణన లో ప్రజలు తమ కులాన్ని నమోదు చేయించుకోవాలని అన్నారు.కుల గణన తో బీసీ ల భవిష్యత్ మారే అవకాశం ఉన్నదని అన్నారు.ఈ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్ వలన మెరిట్ సాధించిన బీసీ లు నష్ట పోతున్నారని అన్నారు.బీసీ ల సమస్యల పరిష్కారం కొరకు జరిగే పోరాటం లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.ఈ కార్యక్రమం లో దాశరాజు జయరాజు, ఆవుల మహేష్, కంచి సత్యనారాయణ, నల్లగంతుల నాగభూషణం, పున్న రాములు, చేగొండి మురళి యాదవ్, ఈశ్వర చారి, మహేశ్వరపు రవి, సూదిన బోయిన శ్రీనివాస్, తిరందాసు వేణు,సింగు రాంబాబు, నేతి సత్యనారాయణ, పోగుల సైదులు, గంగాధర్, గుంజ కొండల్, గాదగోని మహేష్, శివ ప్రసాద్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.