సర్వేలో బీసీలందరూ పాల్గొనాలి..లింగంగౌడ్
రథసారథి, మిర్యాలగూడ:
కులగణన సర్వేలో బీసీ లందరూ స్వచ్ఛందంగా పాల్గొని మన కులాన్ని గర్వంగా చెప్పుకొని భవిష్యత్తు తరాల మన అభివృద్ధికి బాటలు వేసుకుందామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మిర్యాలగూడలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ,బిఆర్ఎస్ పార్టీలు కులగణనకు అడ్డుపడే విధంగా మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. బీసీల యొక్క జనాభా ఎంత ఉందో తెలిస్తేనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉందని దయచేసి కులగణన గురించి వ్యతిరేకంగా మాట్లాడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.ఆధార్,పాన్ కార్డు ఐచ్చికమేనని, అవి ఇష్టముంటేనే చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతుందని అన్నారు. సర్వేలో భాగంగా ఇంటికి వచ్చిన ఎన్యుమనేటర్లకు కచ్చితంగా తమ కులాన్ని గర్వంగా చెప్పుకోవాలని ఈ సందర్భంగా లింగంగౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు.