అంబేద్కర్ కు ఘన నివాళులు

రథసారథి, మిర్యాలగూడ :

బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  68వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడలిలో గల అంబేద్కర్ విగ్రహాలకు కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్ , గాయం ఉపేందర్ రెడ్డి , స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , తలకొప్పుల సైదులు , మాజీ ఎంపీటీసీ ఫోరం జిల్లా నాయకులు బెజ్జం సాయి  మరియు దళిత సంఘ నాయకులు,  అణగారిన వర్గాల ఐక్యవేదిక సభ్యులు, అంబేద్కర్ అభిమానులు, యువకులు మరియు కాంగ్రెస్ నాయకులు ఉబ్బ పెళ్లి కాశయ్య , చిన్నపంగు శ్రవణ్  తదితరులు పాల్గొన్నారు .ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కౌన్సిలర్ కొమ్ము శ్రీనివాస్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

 

Post bottom

Leave A Reply

Your email address will not be published.