సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమ్మె నోటీసు
రథసారథి ,మిర్యాలగూడ:
తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు శుక్రవారం మిర్యాలగూడ మండలం ఎం.ఈ.వో బాలు కు అన్ని వింగ్స్ తరుపున సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.ఈ నెల 6,7,9 రోజులలో రిలే దీక్షలు మండల కేంద్రంలో చేస్తున్నాము అనీ ,ఆ మూడు రోజుల్లో ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే 10 నుండి నిరవధిక సమ్మె కి వెళ్తాము అనీ వారు ఎంఈఓ కు నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిసిఓలు, ఎమ్మెస్ కోఆర్డినేటర్లు, కేజీబీవీ ఉద్యోగస్తులు, ఐఇఆర్పిలు, సిఆర్పిలు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు.