ఎమ్మెల్సీ అభ్యర్థులను మార్చండి :జాజుల లింగం గౌడ్
రథసారథి, మిర్యాలగూడ:
మార్చిలో జరగనున్న నల్గొండ,ఖమ్మం,వరంగల్ ఉపాధ్యాయ ఏమ్మేల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రకటించిన పీఆర్టీయు అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి, యుటిఎఫ్ నుండి నర్సిరెడ్డి, టిపిఅర్టియు నుండి హర్షవర్ధన్ రెడ్డిల అభ్యర్ధిత్వాలను మార్చాలనీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధిపత్య వైఖరిసంఘాలు అగ్రవర్ణాల అభ్యర్థులనే నియమించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు.అసమానతలు లేని సమాజం కొరకు పనిచేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు ఒకే వర్గానికి జై కొట్టడం బాధాకరం అన్నారు.ఆయా సంఘాల్లో 80 శాతం బడుగు బలహీన వర్గాల కు చెందిన ఉపాధ్యాయులు ఉండగా ఎవరికి టికెట్ కేటాయించ కుండా తమ వారినే ప్రకటించు కోవడం సంఘాల నియంతృత్వనికి నిదర్శనం అన్నారు.తమ సంఘం సామాజిక దృక్పధం తో పని చేస్తాయని చెప్పుకునే సంఘాలు వరుసగా అగ్ర వర్ణాల కే అవకాశం ఇవ్వడం ఉపాధ్యాయ లోకాన్ని మోసం చేయడమే అన్నారు.వారి ఆధిపత్య వైఖరి బట్ట బయలు అయిందన్నారు.బడుగు బలహీవర్గాలకు చెందిన ఉపాధ్యాయులు బయటికి వచ్చి బీసీ అభ్యర్థి నీ పోటీలో నిలిపి సంఘాలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు బిసి కుల సంఘాల జేఏసీ కన్వీనర్ గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్ గొర్రెల పెంపకదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఊరిబండి శ్రీనివాస్ యాదవ్ బీసీ యువజన సంఘం నాయకులు ధోనేటి శేఖర్ రాంబాబు సతీష్ తదితరులు పాల్గొన్నారు.