లలిత జ్యువెలరీ షోరూం ప్రారంభం
రథసారథి, మిర్యాలగూడ:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో లలిత జ్యువెలరీ షోరూమ్ ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు హైదరాబాద్ కు వెళ్లకుండా మిర్యాలగూడలోనే లలిత జ్యువెలరీలో బంగారు నగలను కొనుగోలు చేసే అవకాశం లభించింది అన్నారు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కాబట్టి హైదరాబాద్కు వెళ్లే దారి ఖర్చులు మిగులుచుకొని వినియోగ దారులు మిర్యాలగూడలోనే లలిత జ్యువెలరీలో నగలు కొనుగోలు చేయడం మంచిది అన్నారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ నాణ్యతకు, నమ్మకానికి సరైన పేరు మా లలిత జ్యువెలరీ అన్నారు. నాలుగు కాదు 40 దుకాణాలలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించుకున్న తర్వాతనే తమ వద్ద నగలను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. తమ షోరూమ్ లో స్థానిక నిరుద్యోగులకు, మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ,బిఎల్అర్ బ్రదర్స్ పాల్గొన్నారు