ఇస్లాంపూర హైస్కూల్లో నోటు పుస్తకాలు పంపిణీ

రథసారధి, మిర్యాలగూడ:

మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపూర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏడబ్ల్యుఎస్  రాబియా  శుక్రవారం ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఏడబ్ల్యుఎస్ రాబియా   మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థితికి ఎదగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో వసతులను కల్పిస్తోందని, వాటిని విద్యార్థినీ, విద్యార్థులు వినియోగించుకొని బాగా చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాబా, అయూబ్, పి ఈ టి అష్రఫ్, అతియా, ప్రవీణ , శంసున్నిసా, ఫర్హీన్ , నాజ్నీన్, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.