ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉచిత పుస్తకాలు పంపిణీ
రథసారథి ,మిర్యాలగూడ :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బ్ షాబు నగర్ నందు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు ,ఉచిత యూనిఫామ్ లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుక్రవారం అందజేశారు. అదేవిధంగా దాత ,మాజీ కౌన్సిలర్ బంటు లక్ష్మీనారాయణ సహకారంతో ప్రహరీ గోడ 50 మీటర్లు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రాథమిక పాఠశాల షాబ్ గర్ నందు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లావూరి బాలు ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరయ్య, మంగమ్మ ,హరి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.