ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించాలి: ఎంఈఓ బాలు
రథసారథి, మిర్యాలగూడ :
మిర్యాలగూడ మండలం చింతపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ లావూరి బాలు ప్రార్ధన సమయంలో సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో ఉదయం ఏడు గంటల నుండి ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు .ఈ కాలనీలో అసలు ప్రభుత్వ పాఠశాల లేదు అనీ ,చాలామంది ప్రభుత్వ పాఠశాల కావాలని కోరుతున్నారు అని ఎంఈఓ బాలు తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అనీ ,అతి త్వరలో ఇక్కడ పాఠశాల మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఎవరైనా దాతలు ముందుకొస్తే, కమ్యూనిటీ హాల్లో పాఠశాలను నిర్వహించడానికి, ఉపాధ్యాయులను నియమించడానికి సిద్ధంగా ఉన్నాము అని మండల విద్యాధికారి బాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ, ఉపాధ్యాయురాలు సరిత తదితరులు పాల్గొన్నారు.