ముస్లిం మత పెద్దలతో మంత్రి తలసాని ప్రార్థనలు
రథ సారథి,హైదరాబాద్:
అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చాదర్ ను పంపించారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాకు వెళ్ళే ముస్లీం మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.28 వ తేదీన దర్గాలో చాదర్ను సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో జహంగీర్, షేక్ షాబుద్దిన్, మహ్మద్ అబ్బాస్, ముఖ్రం, అబ్రార్, రజాక్ తదితరులు ఉన్నారు.