ప్రజలతో మమేకం కావాలి: శంకర్ నాయక్
రథసారథి,మిర్యాలగూడ:
స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పత్రికా సమావేశంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు హాత్ సే – హాత్ – జోడు, అభియాన్ కార్యక్రమాన్ని జనవరి 26వ తారీఖున ప్రతి పట్టణ, మండల కేంద్రాలలో ప్రారంభించవలెనని తెలియజేసారు. కన్యాకుమారి నుండి కాశీ వరకు జోడోయాత్రలో రాహుల్ గాంధీ పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేయవలసిన కార్యక్రమాలను ప్రజలతో మమేకమై ప్రజల మనోభావాలను తెలుసుకొ న్నారు అనీ శంకర్ నాయక్ తెలిపారు. రాష్ట్రంలో బి ఆర్ఎస్ పార్టీ అనైతిక కార్యక్రమాలు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ వారు చేసే రాజకీయ అనైతిక చర్యలను చార్జిషీట్ ద్వారా ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లను ప్రతి ఇంటికి అతికించాలని అన్నారు. పార్టీ ఆదేశాల అనుసారం రెండు నెలల పాటు గడప గడపకు ఈ కార్యక్రమం తీసుకెళ్లాలని జిల్లా మొత్తం ప్రతి కార్యకర్త ప్రతి వార్డు , గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్లి రాష్ట్రంలొ నల్లగొండ జిల్లా ను ప్రధమ స్థానంలో ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎ సలీం, సీనియర్ నాయకులు, పి. రామలింగయ్య, మెరుగు శ్రీనివాస్, చిలుకూరి బాలు, మాలి కాంతారెడ్డి, తలకొప్పుల సైదులు, జిల్లా కిసాన్ సెల్ ముదిరెడ్డి నర్సిరెడ్డి, కందుల నరసింహారెడ్డి, దేశిడి శేఖర్ రెడ్డి, పొదిల వెంకన్న, గంధం రామకృష్ణ, ఎస్కే అబ్దుల్లా, ఐ ఎన్ టీ యు సి అధ్యక్షుడు ఎస్.కె చాంద్ పాషా, ఎస్కే మస్తాన్, ఎండి ఇమ్రాన్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.