చక చకా రోడ్డు వెడల్పు పనులు
రథ సారథి, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణం పరిధిలోని 6 వ వార్డు హైదలాపూర్ ఇందిరమ్మ కాలనీ వెళ్లే రోడ్డు వెడల్పు పనులు చక చకా సాగుతున్నాయి. స్థానిక అద్దంకి- నార్కట్ పల్లి రాష్ట్ర రహదారి నుండి ఇందిరమ్మ కాలనీ వెళ్లే ప్రధాన రోడ్డు అస్త వ్యస్తంగా మారడంతో ఈ రోడ్డు కు రూ.1.50 కోట్లు కేటాయించి మరమ్మత్తులు ప్రారంభించారు.ఇందులో రూ.1 కోటి మున్సిపల్ నిధులు కాగా మరో రూ.50 లక్షలు రోడ్లు భవనాల శాఖ వారు కేటాయించారు. ఈ నిధులతో స్థానిక అద్దంకి -నార్కట్ పల్లి హైవే నుండి హైదలాపురం ఇందిరమ్మ కాలనీ లోని కాల్వ వరకు 60 అడుగుల రోడ్డు ను వేస్తున్నారు.
ఈ కాలనీ ద్వారా చింతపల్లి, దిలవర్ పూర్, ఇతర తండాలకు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో నిత్యం వేలాది వాహనాలతో పాటు , ప్రజల రాక పోకలతో ఈ రోడ్డు రద్దిగా ఉంటుంది.ఈ కారణం చే ఈ రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే ఎన్. భాస్కర్ రావు చొరవ తీసుకొని ఈ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించి ఈ పనులను ఆయన ప్రారంభించారు.ఇందుకు సంబంధించిన రోడ్డు పనులు శర వేగంగా సాగుతున్నాయి.
వేగంగా పనులు :(6 వ వార్డు కౌన్సిలర్ సాధినేని స్రవంతి శ్రీనివాసరావు )
అద్దంకి -నార్కట్ పల్లి హైవే రోడ్డు నుండి ఇందిరమ్మ కాలనీ వరకు రోడ్డు వెడల్పు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు వెడల్పు వలన కాలనీ వాసులతో పాటు, ఈ దారిలో వున్న పలు గ్రామాల వారికి ఎంతో వసతిగా ఉంటుంది. త్వరలోనే రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తారు వేసేందుకు చర్యలు చేపడుతున్నారు.