నిందితుల దిష్టి బొమ్మ దగ్ధం
రథ సారథి, వేములపల్లి:
ఐద్వా ,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేములపల్లి మండల కేంద్రంలో గురువారం గుర్రంపోడు మండలానికి చెందిన బొంత కావ్య అనే విద్యార్థిని అత్యాచారాన్ని హతమార్చినందుకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగినది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం పాలకవర్గాలు అనుసరించే విధానాల వల్ల తరచూ విద్యార్థినిలు, మహిళల పట్ల అత్యాచారాలు దోపిడీలు ,హింసలు జరుగుతున్నాయి అనీ ఆరోపించారు. .ఆ సందర్భాలలో కఠిన వైఖరి అవలంబించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని, ఇలాంటి ఘటనకు సంబంధించిన కేసులను పరిష్కరించి శిక్షలు వెంటనే పడేటట్లు చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి పాదురి గోవర్ధన, ఐద్వా వేములపల్లి మండల కార్యదర్శి చల్లబట్ల చైతన్య , ఎస్ ఎఫ్ ఐ వేములపల్లి మండల కార్యదర్శి పుట్టసంపత్ , కోటేష్, వెంకటేశం,లతీవి రజియా నర్సమ్మ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.