Hyderabad
మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. 59 రోజుల్లో రూ.3.87 లక్షల ఆదాయం
మల్కాజ్‌గిరి, జూలై 16: మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఎండోమెంట్స్ పర్యవేక్షణ అధికారి మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో గత 59 రోజుల వ్యవధిలో హుండీ ద్వారా రూ.3,87,746 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఏ.బీ. రవీంద్రరెడ్డి తెలిపారు.

