తెలంగాణలో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి: సీపీఎస్ ఉద్యోగుల సంఘం
సూర్యాపేట, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు
సూర్యాపేట, జూలై 16: తెలంగాణ రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాగరణ యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల దీర్ఘకాలిక సామాజిక భద్రత కోసం సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 11న ప్రారంభమైన జనజాగరణ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతోందని తెలిపారు. ఈ యాత్రకు 207 జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సంఘాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన పలు ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని పేర్కొన్నారు.
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని యూనియన్ నాయకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
