Medak

మెదక్‌లో విషాదం.. నిద్రలో తల్లి, కూతురిని కాటేసిన పాము.. చిన్నారి మృతి

మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండలం: మల్లుపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో రాత్రి నిద్రిస్తున్న సమయంలో తల్లి, కూతురిని పాము కాటేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట మండలం: మల్లుపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో రాత్రి నిద్రిస్తున్న సమయంలో తల్లి, కూతురిని పాము కాటేయడంతో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న లావణ్య, ఆమె కుమార్తె హారికను పాము కాటేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరినీ వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల చికిత్స పొందుతూ చిన్నారి హారిక ప్రాణాలు కోల్పోయింది. తల్లి లావణ్యకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతుండగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఘటనతో మల్లుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తుండగా, కుటుంబ సభ్యులు, గ్రామస్థుల నుంచి సమాచారం నమోదు చేస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button