కంది సెంట్రల్ జైలు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
-భద్రతా వ్యవస్థలపై అధికారులకు కీలక ఆదేశాలు

-భద్రతా వ్యవస్థలపై అధికారులకు కీలక ఆదేశాలు
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 17 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారి పరితోష్ పంకజ్, శుక్రవారం కంది సెంట్రల్ జైలును ఆకస్మికంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్‌తో కలిసి జైలు పరిసరాలు, ప్రధాన ప్రవేశ ద్వారాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. జైలులో ఖైదీల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, ఎలాంటి అనుమానాస్పద పరిణామాలు కనిపించినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నిషేధిత వస్తువులు జైలులోకి ప్రవేశించకుండా తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని, సందర్శకుల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని సూచించారు. జైలు ఆవరణలోని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించడంతో పాటు జైలు గోడలు, ప్రధాన గేట్ల వద్ద భద్రతను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందితో తరచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, జైలు శాఖ–పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పెంచి భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్‌తో పాటు జైలు శాఖ అధికారులు పాల్గొన్నారు.



