గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలి
తమ కుటుంబ సభ్యుల ఎస్‌ఐఆర్ ఫారాలను బీఎల్‌వోకు అందజేసిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 17 (రథసారథి న్యూస్):
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి ఓటరు జాబితాలో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని రామ్‌మందిర్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ ప్రత్యేక శిబిరాన్ని ఆమె సందర్శించి, తన కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలతో నింపిన ఫారాలను సంబంధిత బీఎల్‌వోకు స్వయంగా అందజేశారు. తన కుమార్తె జయా రెడ్డి, కుమారుడు భరత్ సాయి రెడ్డి ఫారాలను కూడా బీఎల్‌వోకు సమర్పించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకుని బీఎల్‌వోలకు ఫారాలను అందించాలని సూచించారు.
ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు చురుకుగా పనిచేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 60 శాతం మంది ఓటర్ల ఎస్‌ఐఆర్ నమోదు పూర్తయిందని, మిగిలిన వారు కూడా గడువు ముగిసేలోపు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వో గంగరాజు, వార్డు అధికారులు శ్రావణి, శ్రీనివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, కౌన్సిలర్ శ్రీకాంత్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ అశోక్‌రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు శివుడు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



