వాహనదారుల భద్రతకు ఎన్‌జీఎఫ్ 132 క్యూఆర్ స్టిక్కర్
-ఎస్పీ పంకజ్ పరితోష్ చేతుల మీదుగా బ్రోచర్, క్యూఆర్ స్టిక్కర్ ఆవిష్కరణ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 7 (రథసారథి న్యూస్): వాహనదారుల భద్రతతో పాటు అత్యవసర సమయాల్లో సులభంగా సంప్రదించేందుకు రూపొందించిన ఎన్‌జీఎఫ్ 132–సంపర్క్.మీ బ్రోచర్, కార్లు, ద్విచక్ర వాహనాల కోసం రూపొందించిన క్యూఆర్ స్టిక్కర్‌ను సంగారెడ్డి జిల్లా ఎస్పీ పంకజ్ పరితోష్ ఐపీఎస్ సోమవారం ఆవిష్కరించారు. ఎన్‌జీఎఫ్ 132 క్యూఆర్ స్టిక్కర్ ద్వారా వాహన యజమాని వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను బహిరంగంగా ప్రదర్శించకుండానే అవసరమైన సమయంలో యజమానిని సంప్రదించే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
వాహనం నిలిపివేత, తరలింపు, అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు తదితర వాహనాలకు ఈ క్యూఆర్ స్టిక్కర్‌ను వినియోగించవచ్చన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వాహనదారులకు మరింత సులభమైన, సురక్షితమైన సంప్రదింపు వ్యవస్థను అందించడమే ఎన్‌జీఎఫ్ 132–సంపర్క్.మీ ప్రధాన లక్ష్యమని ఏపీ, తెలంగాణ పంపిణీదారుల ప్రతినిధులు తెలిపారు.



