Hyderabad

సృజనోత్సవ్–2026లో సంగారెడ్డి విద్యార్థుల ప్రతిభా చాటింపు

-జానపద గీత–నృత్యంలో జైత్రకు పురస్కారం..

-పియానో–కీబోర్డ్‌లో వశిష్ట్‌కు అవార్డు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 26 (రథసారథి న్యూస్):

జాతీయస్థాయి కళా, సాంస్కృతిక పోటీల్లో సంగారెడ్డి విద్యార్థులు ప్రతిభను చాటుకుని జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. స్వర మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన సృజనోత్సవ్–2026లో సంగారెడ్డికి చెందిన జైత్ర, వశిష్ట్‌లు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆగస్టు 25న నిర్వహించిన సృజనోత్సవ్–2026 ముగింపు కార్యక్రమంలో జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు.

దేశవ్యాప్తంగా పలువురు కళాకారులు, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జానపద గీత–నృత్య విభాగంలో జైత్ర విశేష ప్రతిభ కనబరిచి అవార్డును సొంతం చేసుకున్నారు. పియానో–కీబోర్డ్ విభాగంలో వశిష్ట్ ప్రతిభను ప్రదర్శించి పురస్కారాన్ని అందుకున్నారు. చిన్న వయసులోనే జాతీయస్థాయి వేదికపై తమ ప్రతిభను చాటిన విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కళాభిమానులు అభినందించారు. సంగీతం, నృత్యం వంటి కళారంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తే వారి సృజనాత్మకత మరింత వికసిస్తుందని పలువురు పేర్కొన్నారు. జైత్ర, వశిష్ట్‌లు సాధించిన ఈ విజయాలు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు స్ఫూర్తినివ్వాలని కళాభిమానులు ఆకాంక్షించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button