Sangareddy

సన్‌రైజ్ ఆసుపత్రిలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు

 

సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 9 (రథసారథి న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని సన్‌రైజ్ హాస్పిటల్‌లో దీపావళి వేడుకలను ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని దీపాలు, విద్యుత్ అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆసుపత్రి యాజమాన్యం సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి నెలకొనాలని ఆకాంక్షించింది.

వైద్య సేవల్లో నిరంతరం విధులు నిర్వహించే సిబ్బంది కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా సిబ్బంది పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఆరోగ్య సేవలతో పాటు పండుగల సందర్భంగా సిబ్బందిలో ఐక్యత, సోదరభావం, ఆత్మీయతను పెంపొందించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button