Sangareddy

కానిస్టేబుల్ ఉచిత శిక్షణతో నిరుద్యోగులకు ఉపయోగం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (రథసారథి న్యూస్):
నిరుద్యోగ యువకులకు ఉచితంగా కానిస్టేబుల్ ఫిసికల్ శిక్షణ (రన్నింగ్, హై జంప్, జాలింగ్ త్రో )అందిస్తున్న తెలంగాణ మేజర్ అకాడమీ వ్యవస్థాపకుడు ఏ. ఆర్.కానిస్టేబుల్ ప్రేమ్ చంద్ ను తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ అధ్యక్షుడు బంగారు కృష్ణ సన్మానం చేశారు.

బుధవారం సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో నిరుద్యోగ యువకులు శిక్షణ పొందుతున్న కేంద్రాన్ని బంగారు కృష్ణ సందర్శించారు. ఈ సందర్బంగా బంగారు కృష్ణ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో ఫిసికల్ కోచింగ్ తీసుకోలేని వారు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి అన్నారు..నిరుద్యోగులు అనుభవం ఉన్న సీనియర్ శిక్షకుడు ప్రేమ్ చంద్ సమక్షంలో క్రమశిక్షణ, అకింతభావం, పట్టుదలతో శిక్షణ పొందితే విజయం సాధిస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ జిల్లా కార్యదర్శి చింతల సాయి కుమార్, భాను ప్రసాద్, అంజన్ కుమార్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button