మార్షల్ ఆర్ట్స్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అభినందనలు
మార్షల్ ఆర్ట్స్‌లో విశేష ప్రతిభ కనబర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి మాల్వే విహాన్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 20 (రథసారథి న్యూస్):
మార్షల్ ఆర్ట్స్‌లో విశేష ప్రతిభ కనబర్చి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి మాల్వే విహాన్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విహాన తన తల్లిదండ్రులు రామేశ్వర్, అశ్విని తో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
చిన్న వయస్సులోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి సంగారెడ్డి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు. భవిష్యత్తులోనూ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయాలు సాధించి దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ చిన్నారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి, బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, వసంత్ రెడ్డి తదితరులు పాల్గొని చిన్నారిని అభినందించారు.



