Sangareddy

సంగారెడ్డిలో సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 19 (రథసారథి న్యూస్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న పాపన్న విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, ఎక్సైజ్ డీఎస్పీ, సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, వెనుకబడిన తరగతుల జిల్లా సంక్షేమ అధికారి జగదీష్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, గౌడ జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్, కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు ఆశన్నగౌడ్, కేజీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌గౌడ్, సన్‌రైజ్‌ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పాల స్వామిగౌడ్, ప్రముఖ న్యాయవాది పాల సంతోష్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర యువజన సంఘాల నాయకుడు డాక్టర్ కూన వేణు, తదితరులు పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ ఆశయాలు, ఆలోచనా విధానాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ఐక్యంగా పనిచేస్తూ ప్రజా సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పాపన్న చూపిన స్ఫూర్తితో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. జయంతి వేడుకల్లో భాగంగా సంగారెడ్డి మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి గౌడ సోదరులు, గౌడ సంఘాల అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, టీఎఫ్‌టీ సభ్యులు, గౌడ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా వివిధ గ్రామాల నుంచి గౌడ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గౌడ సంఘాల నాయకులు, కల్లుగీత కార్మిక సంఘం నాయకులతో పాటు మల్లాగౌడ్, వెంకటేష్‌గౌడ్, మధుగౌడ్, సంగమేశ్వర్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, పలువురు సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button